
అమలాపురం: మంత్రి విశ్వరూప్ (minister viswaroop) ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కోనసీమ జిల్లా (Konaseema District)ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు, యువకులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. అయితే ఈ దాడిపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. యువతను కావాలనే రెచ్చగొడుతున్నారని, చేతులు జోడించి వేడుకుంటున్నారని, ప్రజలు శాంతించాలని కోరారు. తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు ప్రజలు గర్వపడాలన్నారు. విపక్షాలు డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ పేరు పెట్టామని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు.