Job calendar అమలుపై సీఎం Jagan సమీక్ష నేడు

ABN , First Publish Date - 2022-06-17T13:21:22+05:30 IST

సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ అమలుపై సమీక్ష చేయనున్నారు.

Job calendar అమలుపై సీఎం Jagan సమీక్ష నేడు

Amaravathi: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan reddy) శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లి (Tadepalli) క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్ (Job calendar) అమలుపై  సమీక్ష చేయనున్నారు. విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధం అవడంతో హడావుడిగా సమీక్ష జరపనున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి సంవత్సరమైనా ఇప్పటి వరకు నోటిఫికేషన్ (Notification) ఇవ్వకపోవడంపై విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళన బాటకు సిద్ధమవుతున్నాయి. గతేడాది జూన్ 18న 10,143 పోస్టులకు జాబ్ క్యాలెండర్.. నెలకో నోటిఫికేషన్ అని వెల్లడించారు. మాట తప్పిన జగన్ సర్కార్‌పై శుక్రవారం నుంచి విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టనున్నాయి.

Updated Date - 2022-06-17T13:21:22+05:30 IST