
అమరావతి: జిల్లాల పునర్వవస్థీకరణపై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ, ప్లానింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాల విభజనపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, పరిష్కారంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు తెలిపిన అభ్యంతరాలు, ఫిర్యాదులు వాటి పరిష్కారాలపై చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. అలాగే జిల్లాల ఏర్పాటు, పేర్లపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి