మొండివైఖరి వీడి.. న్యాయం చేయండి

ABN , First Publish Date - 2020-09-23T14:18:06+05:30 IST

మూడు రాజధానులపై మొండివైఖరి వీడి న్యాయం చేయాలని అమరావతి..

మొండివైఖరి వీడి.. న్యాయం చేయండి

280వ రోజు ఆందోళనల్లో రైతులు, మహిళలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): మూడు రాజధానులపై మొండివైఖరి వీడి న్యాయం చేయాలని అమరావతి రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చేస్తోన్న ఉద్యమం మంగళవారానికి 280వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలన్నారు. కాని రాష్ట్రంలో పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని విమర్శించారు.

  

ప్రాణాలైనా అర్పిస్తాం.. అమరావతిని సాధిస్తామని తాడేపల్లి మం డలం పెనుమాక, ఉండవల్లిలో రైతులు, రైతు కూలీలు, ఐకాస ప్రతినిధులు తెలిపారు. ఆయా గ్రామాల్లో 280వ రోజు నిరసన దీక్షలు కొనసా గించారు. పెనుమాక దీక్షలో కళ్లం రాజశేఖర్‌రెడ్డి, ఎం మాణిక్యాలరావు, దండమూడి ఉమామహేశ్వరరావు, సాబ్‌జాన్‌, ఎర్రపీరు, పుల్లారెడ్డి, గుం టక సాంబిరెడ్డి, దండమూడి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఉండ వల్లిలో జరిగిన దీక్షలో కూనపరెడ్డి రమేష్‌, బుజ్జి, తమ్మా శంకర్‌రెడ్డి, రామారావు, అప్పారావు, వల్లభాపురం రమేష్‌, లీలాకృష్ణ, సతీష్‌, రవితేజ, రాజేష్‌ పాల్గొన్నారు.

 

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాల్లో రైతు సంఘ నేతల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే  దీక్షలు 280వ రోజుకు చేరా యి. ఆయా కార్యక్రమాల్లో కిరణ్‌, ఉమామహేశ్వరరావు, వీరాంజనేయులు, వై భాగ్యారావు, దుర్గారావు, తోట భాగ్యమ్మ, భాస్కరరావు, వెంకటే శ్వరరావు, శేషగిరిరావు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోత డక గ్రామాల్లో రైతులు, మహిళలు మంగళవారం నిరసనలు కొనసాగిం చారు. రాజధాని విషయంలో రైతుల ఆకాంక్ష నేరవేర్చాలంటూ మోతడకలో కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 

Updated Date - 2020-09-23T14:18:06+05:30 IST