ఆంధ్రుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్న జగన్: మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావ్

ABN , First Publish Date - 2022-02-25T02:54:54+05:30 IST

అమరాతి పరిరక్షణ ఉద్యమం 800 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, అమరావతి రాజధాని రైతులు, మహిళలు, చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీలోని ప్రవాసాంధ్రులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జాతి పిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, దీక్ష చేపట్టారు.

ఆంధ్రుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్న జగన్: మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావ్

అమరాతి పరిరక్షణ ఉద్యమం 800 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, అమరావతి రాజధాని రైతులు, మహిళలు, చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీలో ప్రవాసాంధ్రులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. జాతి పిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ..అమరావతి రైతులు శాంతియుతంగా చేపడుతున్న నిరసన దీక్ష 800 రోజులకు చేరిందని తెలిపారు. ఈ నిరసన చరిత్రలో నిలిచపోతుందని వ్యాఖ్యానించిన ఆయన.. ఒకప్పుడు జగన్ పాలన కోరుకున్న వారందరూ నేడు సిగ్గుతో తలదించుకుంటున్నారని తెలిపారు. 



నాడు అమరావతిని రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతించిన జగన్ నేడు మూడు రాజధానులు ఏర్పాటు చేయడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. తెలుగు వారికి రాజధాని లేకుండాపోవడాన్ని ప్రవాసాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. అన్ని జిలాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామంటూ జగన్ చేస్తున్న పిట్టల దొర వ్యాఖ్యలకు ప్రవాసాంధ్రులు నవ్వుకుంటున్నారని తెలిపారు. మూడు రాజధానుల వల్ల వినాశనమే కానీ వికాసం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులు భాను మాగులూరి మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడితే ఇతర జిల్లాల్లో నిధుల కటకట ఏర్పడుతుందంటూ సీఎం జగన్ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 



ఎన్నారై సిద్ధార్ధ బోయపాటి మాట్లాడుతూ.. నిధులు లూటీ చేయడానికి అమరావతి తాకట్టు పెట్టి రూ. 50 వేల కోట్లు తెచ్చుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డా. లిఖిత్ ఎల్లా మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన రైతులు తమ భాదను వెళ్లబొసుకునేందుకు వీధుల్లోకి వస్తే జగన్ ప్రభుత్వం వారిని అణగదొక్కేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఈ కార్యక్రమంలో వీనిల్ శ్రీరామినేని, డా. నాగ దేవినేని, చంద్రశేఖర్ నాదెళ్ల తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-25T02:54:54+05:30 IST