అమరావతి ఉద్యమంలోకి దళిత యువత

ABN , First Publish Date - 2021-10-27T04:22:22+05:30 IST

అమరావతి ఉద్యమంలో దళిత యువత కీలకంగా ఉంటుందని రాజధాని అమరావతి దళిత యువజన జేఏసీ కన్వీనర్‌ తురకా రాజేంద్రప్రసాద్‌, కో-కన్వీనర్‌ బేతపూడి సుధాకర్‌ పేర్కొన్నారు.

అమరావతి ఉద్యమంలోకి దళిత యువత
తుళ్లూరు రైతు ధర్నా శిబిరంలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న దళిత యవజన జేఏసీ సభ్యులు

తుళ్లూరు, అక్టోబరు 26: అమరావతి ఉద్యమంలో దళిత యువత కీలకంగా ఉంటుందని రాజధాని అమరావతి దళిత యువజన జేఏసీ కన్వీనర్‌ తురకా రాజేంద్రప్రసాద్‌, కో-కన్వీనర్‌ బేతపూడి సుధాకర్‌ పేర్కొన్నారు.  దళిత యువజన జేఏసీ నూతన కమిటీ ఇటీవల ఏర్పడింది. ఆ కమిటీ సభ్యులు మంగళవారం రైతుదీక్ష శిబిరాలకు వచ్చి సంఘీభావం తెలిపారు. రాజధానిలో దళిత యువత భవిష్యత నాశనం అవుతుంటే, భూములిచ్చిన అన్నీ వర్గాల రైతులు రోడ్డు పడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహా పాదయాత్రలో దళిత యువజన జేఏసీ కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతు జేఏసీ సూచనలు సలహాల ప్రకారం ఉద్యమంలో నడుచుకుంటామని తెలిపారు.   

- అన్ని వర్గాల ప్రజలు రాజధాని అమరావతికి భూములు ఇచ్చారని, అందులో ఎక్కువశాతం బడుగు బలహీన వర్గాల వారేనని రాజధాని ముస్లిం మైనార్టీ జేఏసీ కన్వీనర్‌ షేక్‌ జానీబాషా అన్నారు. మంగళవారం తుళ్లూరు ధర్నా శిబిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబరు ఒకటిన రాజధాని ప్రజలు చేపడుతున్న న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్రలో ముస్లిం మైనార్టీలు అధిక  సంఖ్యలో పాల్గొనాలని జానీ పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-10-27T04:22:22+05:30 IST