Advertisement

318వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు

Oct 30 2020 @ 07:43AM

అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 318వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు  కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. 


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.