అమరావతి: అమరావతిలోని శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానాన్ని రాజధాని రైతులు సందర్శించారు. దేవాలయం వద్ద అమరావతిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. గోవింద గోవింద అంటూ నినాదాలు చేశారు. తిరుమల పాదయాత్ర చేయగానే హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిందని, పాలకుల మనస్సు మార్చి అమరావతి నిర్మించేలా మనసు మార్చాలని వెంకటేశ్వరునికి అమరావతి రైతులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి