
అమరావతి: అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని అమరావతి దళిత జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమరావతిలోని తుళ్లూరు అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టింది. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాజధాని అమరావాతి దళిత జేఏసీ కన్వీనర్ మార్టీన్ లూథర్ హెచ్చరించారు. కోర్టు తీర్పులను కాదని ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పు తర్వాత కూడా సీఎం ఇప్పటికీ కూడా మూడు రాజధానుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. న్యాయస్థానాన్ని గౌరవించలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడలేని ప్రభుత్వాన్ని తక్షణమే భర్తరఫ్ చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి