Amaravati: అమరావతి మున్సిపాలిటీ దిశగా ప్రభుత్వం కసరత్తు

ABN , First Publish Date - 2022-09-08T23:44:52+05:30 IST

అమరావతి (Amaravati) మున్సిపాలిటీ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేసే దిశ‌గా

Amaravati: అమరావతి మున్సిపాలిటీ దిశగా ప్రభుత్వం కసరత్తు

గుంటూరు: అమరావతి (Amaravati) మున్సిపాలిటీ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేసే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తుళ్లూరు, మంగళగిరి (Tullur Mangalagiri) మండలాల్లోని 22 గ్రామాలతో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్కు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామసభలకు కలెక్టర్ నోటీసులిచ్చారు. గ్రామపంచాయతీల అభ్యంతరాలు తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. గతంలో 22 గ్రామాలతో కార్పొరేషన్ ప్రతిపాదనల్ని ప్రజలు వ్యతిరేకించారు. 29 గ్రామాలతో అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. రాజధానికి భూములు తీసుకునేటప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం 29 గ్రామాలను కలిపి అమరావతి రాజధాని స్మార్ట్‌ సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా రాజధానిని నిర్వీర్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-08T23:44:52+05:30 IST