పంజాబ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అమరీందర్ సింగ్

ABN , First Publish Date - 2022-04-22T22:43:37+05:30 IST

ఇక అమరీందర్ సింగ్ రాజా గురించి మాజ అధ్యక్షుడు సిద్ధూ మాట్లాడుతూ ‘‘కొత్త అధినేత అమరీందర్ సింగ్ రాజాను అభినందించడానికి ఇక్కడికి వచ్చాను. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగబోవని అనుకుంటున్నాను..

పంజాబ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అమరీందర్ సింగ్

చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరమే రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ బలోపేతం చేయడానికి త్రీడీ మంత్రను అవలంబించాని అమరీందర్ సింగ్ రాజా సూచించారు. ఆ మూడు మంత్రాలు ‘డిసిప్లిన్, డెడికేషన్, డైలాగ్’ అని ఆయన పేర్కొన్నారు.


ఇక అమరీందర్ సింగ్ రాజా గురించి మాజ అధ్యక్షుడు సిద్ధూ మాట్లాడుతూ ‘‘కొత్త అధినేత అమరీందర్ సింగ్ రాజాను అభినందించడానికి ఇక్కడికి వచ్చాను. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగబోవని అనుకుంటున్నాను. కాంగ్రెస్‌ను పునరావిష్కరించాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చాలని అధిష్టానం నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూని తప్పించి అమరీందర్ సింగ్ రాజాను నియమించింది.

Updated Date - 2022-04-22T22:43:37+05:30 IST