జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర

Published: Sun, 27 Mar 2022 16:59:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర

శ్రీనగర్‌: జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో భక్తులు కోవిడ్ గైడ్‌లైన్స్ పాటించడం తప్పనిసరి చేశారు. లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీ అమర్‌నాథ్ ఆలయ కమిటీ బోర్డ్ ప్రతినిధులతో సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 ఆగస్ట్‌లో అమర్‌నాథ్ యాత్రను అర్ధాంతరంగా నిలిపివేశారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నామమాత్రంగా నిర్వహించారు.    


హిమాలయాల్లో దక్షిణ కశ్మీర్‌ కొండల్లో 3,880 మీటర్ల ఎత్తులో మంచు ఆకారంలో పరమశివుడు కొలువై ఉంటారు. ప్రతి ఏడాదీ రక్షాబంధన్ రోజు అమర్‌నాథ్ యాత్ర ప్రారంభించడం ఆనవాయితీ.      

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.