ఫుల్ ఛార్జింగ్ లో... అమరరాజా బ్యాటరీస్‌

ABN , First Publish Date - 2021-06-23T00:22:42+05:30 IST

అమరరాజా బ్యాటరీస్‌... ఫుల్ ఛార్జ్ అవుతుందంటూ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఈ ఏడాదికాలంగా 50 శాతం ర్యాలీ చేయగా అమరరాజా బ్యాటరీస్ మాత్రం కేవలం 11 శాతం మాత్రమే పెరిగింది.

ఫుల్ ఛార్జింగ్ లో... అమరరాజా బ్యాటరీస్‌

హైదరాబాద్ : అమరరాజా బ్యాటరీస్‌... ఫుల్ ఛార్జ్ అవుతుందంటూ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఈ ఏడాదికాలంగా 50 శాతం ర్యాలీ చేయగా అమరరాజా బ్యాటరీస్ మాత్రం కేవలం 11 శాతం మాత్రమే పెరిగింది. దీంతో ఈ స్టాక్‌నె  వదిలించుకుందామనన్న ఆలోచనలు కూడా చోటుచేసుకున్నాయి. ఎందుకంటే ఇతర కంపెనీల షేర్లు దూసుకుపోతుంటే, ఇది మాత్రం ఇలానే చతికిలబడి ఉండడమే ఇందుకు కారణం.  అయితే... ఈ స్టాక్ కూడా ర్యాలీ చేస్తుందంటూ అంచనాలు వస్తుండటం విశేషం. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


రూ. 12 వేల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ ఉన్న అమరరాజా బ్యాటరీస్... జూన్ 18 నాటి క్లోజింగ్‌ ధర(

రూ. 748)తో పోల్చితే ఏకంగా 50-80 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే ఈ ధరలో కొనుగోలు చేసి ఆరు నెలల కోసం ఎదురు చూసేవాళ్లు మాత్రం స్టాప్‌లాస్‌గా రూ. 630 ని ఖరారు చేసుకోవాలంటున్నారు. ఇండస్ట్రీలో అతి పెద్ద  లెడ్ యాసిడ్ బ్యాటరీల ఉత్పత్తిదారులుగా అమరరాజా బ్యాటరీస్ వాసికెక్కిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-06-23T00:22:42+05:30 IST