బ్యాటరీల రీసైక్లింగ్‌ కోసం అమరరాజా కొత్త కంపెనీ

ABN , First Publish Date - 2022-05-21T08:41:46+05:30 IST

బ్యాటరీల రీసైక్లింగ్‌ కోసం అమరరాజా బ్యాటరీస్‌ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది.

బ్యాటరీల రీసైక్లింగ్‌ కోసం అమరరాజా కొత్త కంపెనీ

త్రైమాసిక లాభం రూ.99 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బ్యాటరీల రీసైక్లింగ్‌ కోసం అమరరాజా బ్యాటరీస్‌ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. అమరరాజా సర్క్యులర్‌ సొల్యూషన్స్‌ పేరుతో నెలకొల్పనున్న కొత్త కంపెనీకి బోర్డు ఆమోదం తెలిపిందని అమరరాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. కొత్త కంపెనీ అమరరాజాకు వంద శాతం అనుబంధ కంపెనీగా ఉంటుంది. రీసైక్లింగ్‌ ప్లాంట్‌లో బ్యాటరీల రీసైక్లింగ్‌తో పాటు బ్యాటరీల తయారీ యూనిటలో ఉత్పత్తి అయ్యే ఇండస్ట్రియల్‌ వ్యర్థాలు, ప్లాస్టిక్స్‌ను కూడా ఇక్కడ రీసైక్లింగ్‌ చేయనున్నట్లు తెలిపింది. కాగా 2021-22 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి గాను కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ.98.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.189.38 కోట్లతో పోలిస్తే 48 శాతం క్షీణించింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.2,103 కోట్ల నుంచి రూ.2,181 కోట్లకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,697 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.512.57 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌పై 50 పైసల (50ు) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. 

Updated Date - 2022-05-21T08:41:46+05:30 IST