చినవెంకన్న భక్తుల రద్దీపై అమావాస్య ప్రభావం

ABN , First Publish Date - 2022-06-29T06:11:46+05:30 IST

చినవెంకన్న భక్తుల రద్దీపై అమావాస్య ప్రభావం

చినవెంకన్న భక్తుల రద్దీపై అమావాస్య ప్రభావం
ఆలయానికి విచ్చేస్తున్న ఎంపీ కుటుంబం

ద్వారకాతిరుమల, జూన్‌  28 : చినవెంకన్న ఆలయంలో భక్తుల రద్దీపై అమావాస్య ప్రభావాన్ని చూపింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి జోరున వర్షం కురుస్తుండటంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గింది. వందల సంఖ్యలోనే ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. చిన్న తిరుమలేశుని ఆలయాన్ని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన స్వామి, అమ్మ వార్లను దర్శించి ప్రత్యేకపూజలు జరుపుకొ న్నారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందచేసారు. ఏఈఓ లక్ష్మణ స్వామి స్వామివారి మెమొంటోను అందించారు.


Updated Date - 2022-06-29T06:11:46+05:30 IST