భారత్‌పై దృష్టిపెట్టిన అమెజాన్‌ అలెక్సా

ABN , First Publish Date - 2022-05-14T08:39:47+05:30 IST

మన దేశంలో నాలుగేళ్ళుగా పనిచేస్తున్న అమెజాన్‌ అలెక్సా మరింతగా చొచ్చుకువచ్చే యత్నంలో ఉంది. ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ ఇంతకుమునుపు

భారత్‌పై దృష్టిపెట్టిన అమెజాన్‌ అలెక్సా

మన దేశంలో నాలుగేళ్ళుగా పనిచేస్తున్న అమెజాన్‌ అలెక్సా మరింతగా చొచ్చుకువచ్చే యత్నంలో ఉంది. ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ ఇంతకుమునుపు అమెజాన్‌ ఎకో స్పీకర్లపైనే ఉండేది. ఇప్పుడు మూడో పార్టీ డివైస్‌ల్లోనూ పనిచేస్తోంది. స్మార్ట్‌ టీవీలు, స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, స్టీరియో ఇయర్‌ బడ్స్‌, హెడ్‌ఫోన్ల వరకు అన్నింటికీ విస్తరించింది. ఇంగ్లీష్‌ భాషలో సేవలను ఆరంభించిన ఈ వాయిస్‌ అసిస్టెంట్‌, తదుపరి రోజుల్లో హిందీ, హింగ్లిష్‌ అంటే రెండు భాషలు కలిపి కూడా సేవలు అందిస్తోంది. ఆ క్రమంలో అలెక్సా ఇంటిగ్రేటెడ్‌ డివైస్‌లపై ఇటీవల సమీక్ష జరిగింది. వాస్తవానికి అలెక్సా ఇండియా సర్వీసులు 2017 అక్టోబరులో ఆరంభమయ్యాయి. ఎకో రేంజ్‌ మొదట్లో ఆహ్వానితులకే పరిమితం. 2018 ఫిబ్రవరి నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. తదుపరి రోజుల్లో మూడో పార్టీ అంటే లాగిటెక్‌, హర్మన్‌ కర్డాన్‌, మోటారోల మోటో మోడ్‌కు విస్తరించింది. లోకలైజ్‌ అయిన తరవాత అలెక్సా ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్‌ పదాలను అర్థం చేసుకోవడం ఆరంభించింది.  2018లో అమెజాన్‌ ఒక నైపుణ్యం - క్లియోను పరిచయం చేసింది. అది అలెక్సాకు హిందీ సహా ఇతర భారతీయ భాషలను నేరుగా యూజర్ల నుంచే నేర్చుకునే అవకాశాన్ని కల్పించింది.


తదుపరి అమెజాన్‌ ఇంజనీర్లు బైలింగ్యువల్‌ ఆటోమేటిక్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌(ఏఎస్‌ఆర్‌) సిస్టమ్‌ని అభివృద్ధిపర్చారు. తత్ఫలితంగా ఒకేసారి హిందీ, ఇంగ్లీష్‌ పదాలను అలెక్సా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. తెలుగు తమిళం, మరాఠీ భాషల కోసం స్లాట్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఎకో డివైస్‌లు దేశంలోని 85 శాతం పిన్‌కోడ్స్‌ ఉన్న ప్రాంతాలకు చేరువయ్యాయి.  రెగ్యులర్‌ కస్టమర్లకు తోడు అలెక్సా మూడో పార్టీ డివైస్‌లతో తరగతి గదులకూ విస్తరిస్తోంది. 

Read more