చిన్నారిని కాపాడిన Amazon delivery agent.. హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-07-04T00:59:57+05:30 IST

ఒక్కోసారి చిన్న సహాయం పెద్ద ప్రమాదాలను తప్పిస్తుంది. ప్రాణాలను సైతం నిలబెడుతుంది.

చిన్నారిని కాపాడిన Amazon delivery agent.. హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

ఒక్కోసారి చిన్న సహాయం పెద్ద ప్రమాదాలను తప్పిస్తుంది. ప్రాణాలను సైతం నిలబెడుతుంది. తాజాగా అమెజాన్ డెలివరీ బాయ్ స్పందించిన వైనం చిన్నారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. మహారాష్ట్రలోని థానేలో వసంత్ విహార్ మున్సిపల్ స్కూల్ గేట్ దగ్గర శుక్రవారం ఉదయం ఓ 12 ఏళ్ల అమ్మాయి ఆడుకుంటోంది. ప్రమాదవశాత్తూ గేటు ఇనుప ముక్క ఆమె చెంపలో గుచ్చుకుపోయింది. కంటికి కేవలం ఒక అడుగు దూరంలో ఆగిపోయింది. బాధతో విలవిలలాడిన ఆ బాలిక పెద్దగా కేకలు పెట్టింది.


ఇది కూడా చదవండి..

పాములు పట్టడంలో ఎక్స్‌పర్ట్.. 40 ఏళ్లుగా అదే పని.. చివరకు అతను ఎలా చనిపోయాడంటే..


ఆ సమయంలో అటువైపే బైక్‌పై వెళ్తున్న అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ రవి భండారీకి ఆ బాలిక అరుపులు వినిపించాయి. స్కూల్ వాచ్‌మెన్‌తో కలిసి వెంటనే ఆ బాలిక దగ్గరకు వెళ్లాడు. ఆమె చెంపలో ఇనుప ముక్క గుచ్చుకోవడం చూశాడు. ఇద్దరూ కలిసి రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నించారు. ఆలస్యమైతే కంటికి కూడా గాయం అయ్యే ప్రమాదం ఉందని రవి గ్రహించాడు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రి సిబ్బందికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. వెంటనే ఆస్పత్రి నుంచి ఓ డాక్టర్, నర్స్ వచ్చారు. వారు జాగ్రత్తగా గేట్ ఇనుప భాగాన్ని కత్తిరించి బాలికను రక్షించారు. 


రవి వెంటనే స్పందించకపోయి ఉంటే ఆ అమ్మాయి కంటికి కూడా గాయం అయ్యేదని వైద్యులు చెబుతున్నారు. ఈ సంఘటనను ప్రతీక్ అనే వ్యక్తి ట్విటర్‌‌లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు రవిపై ప్రశంసల వర్షం కురిపించారు. మానవత్వంతో వ్యవహరించిన రవికి బహుమతి ఇవ్వాలని చాలా మంది అమెజాన్‌ను కోరారు. 

Updated Date - 2022-07-04T00:59:57+05:30 IST