Amazon: తెలంగాణలో 50 వేలమంది గిరిజన బాలికలకు అమెజాన్ చేయూత

ABN , First Publish Date - 2022-09-28T00:28:02+05:30 IST

చిన్నారులకు కంప్యూటర్ సైన్స్‌లో చేయత అందించేందుకు అమెజాన్ ప్రారంభించిన అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్

Amazon: తెలంగాణలో 50 వేలమంది గిరిజన బాలికలకు అమెజాన్ చేయూత

హైదరాబాద్:  చిన్నారులకు కంప్యూటర్ సైన్స్‌లో చేయత అందించేందుకు అమెజాన్ ప్రారంభించిన అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ (AFE).. ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ (Ei) మైండ్‌స్పార్క్ (Mindspark)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 50 పాఠశాలల్లోని విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్‌ను పరిచయం చేయడంతోపాటు ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ (FLN)ను పెంపొందించేందుకు కృషి చేస్తోంది.


ఇందులో భాగంగా అడాప్టివ్ లెర్నింగ్ ప్రోగ్రాం (PAL) ద్వారా అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ల్యాబ్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ కెరియర్‌లోకి మారేందుకు అవకాశం లేని విద్యార్థులకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుంది. సెప్టెంబరు 2021లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 50,000 మంది బాలికలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.


50 గిరిజన పాఠశాలల్లోని 10 వేల మంది బాలికలపై ప్రభావం చూపిన కార్యక్రమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా  200 గిరిజన పాఠశాలలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 'కంప్యూటర్ శిక్షలో నూతన అధ్యాయం-భవిషత్తు ఇంజనీర్లకు సహకారం’ పేరుతో టీడబ్ల్యూఏఎస్ ముత్యాలమ్మగూడెంలో ఈ నెల 22న నిర్వహించారు. స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 200 గిరిజన పాఠశాలలను అభివృద్ధి చెందేలా చేయడం, అన్ని సామాజిక, ఆర్థిక నేపథ్యాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ విద్యను దగ్గర చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.


ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. టీడబ్ల్యూఏఎస్ ముత్యాలమ్మ గూడెం పాఠశాల విద్యార్థులు అమెజాన్ ద్వారా నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ విద్యను పొందడం హర్షణీయమన్నారు. ఏఎఫ్ఈ, ఈఐ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర గిరిజన పాఠశాలలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు వారితో భాగస్వామ్యం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 


 కంప్యూటర్ సైన్స్ కెరియర్‌ను అభ్యసించేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా కూడా మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా సీఎస్ఆర్, కార్పొరేట్ ఫలాంత్రఫీ, ఇండియా అండ్ అమెజాన్ హెడ్ అనితాకుమార్ మాట్లాడుతూ.. సృజనాత్మకతను వెలికితీయడంలో, మానవ సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కంప్యూటర్ సైన్స్ శక్తిని తాము విశ్వసిస్తామన్నారు. గత ఏడాది దాదాపు 3,50,000 మంది విద్యార్ధులు కంప్యూటర్ సైన్స్ శిక్షణను పొంది వారి భవిష్యత్తుని సాంకేతిక పరిశ్రమలో అతున్నతమైన స్థానాల్లో నిలబెట్టుకున్నట్టు చెప్పారు. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో మారుమూల గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో గణితం, భాషా అభ్యాసాన్ని జోడించడానికి ఒక అడుగు ముందుకు వేసి 8,700 మంది విద్యార్థులు రాణించేందుకు సహాయం చేసినట్టు వివరించారు. 


ఈఐ శిక్షా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ విద్య ప్రాముఖ్యత, ప్రోగ్రామ్ ప్రభావంపై తన ఆలోచనలను పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో వృత్తిని కొనసాగించాలనే ఆసక్తి, దృఢ సంకల్పం ఉన్న ఏ విద్యార్థి కూడా సమర్థవంతమైన బోధనా శాస్త్రం లే, వనరులకు ప్రాప్యత లేకపోవడం వల్ల వెనుకడుగు వేయకుండా చూసుకోవాలని అన్నారు. తెలంగాణలో అమెజాన్ విజన్, గిరిజన శాఖ మద్దతు, పాఠశాల నాయకత్వం కలిసి రావడంతో ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. 

Updated Date - 2022-09-28T00:28:02+05:30 IST