వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు అమెజాన్ బంపర్ ఆఫర్!

ABN , First Publish Date - 2021-08-08T02:24:09+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి తిరిగి ప్రారంభమైంది. డెల్టా వేరియంట్ కారణంగా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వం వి

వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు అమెజాన్ బంపర్ ఆఫర్!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ ఉధృతి తిరిగి ప్రారంభమైంది. డెల్టా వేరియంట్ కారణంగా గణనీయంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అమెరికా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. తాజాగా అమెజాన్ సంస్థ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మద్దతు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న అమెరికాలోని తన ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు భారీ మొత్తంలో ఆఫర్లు ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా 14.9కోట్లను కేటాయించిందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లు అందజేస్తూ.. డ్రాలో విజేతలుగా నిలిచిన మొదటి ఇద్దరికి రూ.3.7కోట్లను అమెజాన్ అందించనుందని తెలిపింది. తర్వాత ఆరుగురికి రూ. 74లక్షలు, మరో ఐదుగురికి కార్లు, వెకేషన్ ప్యాకేజీలను అందించనుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. 


Updated Date - 2021-08-08T02:24:09+05:30 IST