
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ (Amazon) సంస్థ సంవత్సరంలో ఒకసారి ప్రకటించే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు (Amazon Prime Day Sale) ముహూర్తం ఫిక్సయింది. జులై 23 నుంచి జులై 24వ తేదీ వరకూ ఇండియాలో ప్రైమ్ కస్టమర్లకు (Prime Customers) ‘అమెజాన్ ప్రైమ్ డే’ సేల్‌ను (Amazon Prime Day Sale) అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సదరు ఈ-కామర్స్ సంస్థ వెల్లడించింది. జులై 23న అర్ధరాత్రి 12:00 గంటలకు మొదలవనున్న ఈ సేల్ జులై 24 రాత్రి 11:59కి ముగుస్తుంది.
ఇండియాలో ఇది 6th Prime Day Sale కావడం విశేషం. ఈ ప్రైమ్ డే సేల్‌లో ప్రైమ్ కస్టమర్లు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఉత్పత్తులు, హోం, కిచెన్, ఫర్నిచర్‌పై భారీ డిస్కౌంట్లను ఈ ప్రైమ్ డే సేల్‌లో కస్టమర్లు పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు మాత్రమే ఈ సేల్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. 23, 24 తేదీల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల లోపు WOW Deals పేరుతో ల్యాప్‌టాప్స్, హెడ్‌సెట్స్, బ్లూ టూత్ స్పీకర్స్, కెమెరాలపై భారీ డిస్కౌంట్స్‌ను అమెజాన్ ప్రకటించనుంది.
ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌పై 40 శాతం వరకూ, ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్‌పై 75 శాతం వరకూ, టీవీలపై 50 శాతం వరకూ తగ్గింపు ఉంటుందని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ ఫ్యాషన్ పేరుతో ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకూ డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు సదరు ఈ-కామర్స్ సంస్థ తెలిపింది. ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో దాదాపు 30,000 వేలకు పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారు. 400కు పైగా ఇండియన్ కంపెనీల ఉత్పత్తులతో పాటు శామ్‌సంగ్, షియోమీ, బోట్, ఇంటెల్ కంపెనీలకు సంబంధించిన కొత్త ఉత్పత్తులు కూడా అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా విడుదలవుతున్నట్లు అమెజాన్ పేర్కొంది.