అంబేడ్కర్‌ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు

Dec 7 2021 @ 01:06AM
గన్నవరంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న అర్జునుడు

గన్నవరం, డిసెంబరు 6 : అంబేడ్కర్‌ ఆశయాలకు ప్రభుత్వం తూ ట్లు పొడుస్తుందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. భారత రాజ్యాం గ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌  వర్ధంతిని సోమవారం మండలంలో  వివిధ పార్టీల నాయ కులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు పూలమాలలు వేసి నివాళులర్పించి అంబేడ్కర్‌ సేవ లను కొనియాడారు. నాయకులు దొంతు చిన్నా, జూపల్లి సురేష్‌, మూ ల్పూరి సాయి కళ్యాణి, కంచర్ల ఈశ్వరరావు, మండవ అన్వేష్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయంలో ఎంపీపీ అనగాని రవి, జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌ రాణి, గొంది పరంధామయ్య, మేచినేని బాబు తదితరులు పాల్గొన్నారు. దావాజీగూడెం స్పందన మానసిక వికాస కేంద్రంలో అంబేడ్కర్‌ వర్ధంతిని జరిపారు. సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు కళ్ళం వెంకటేశ్వరరావు, మల్లంపల్లి ఆంజనేయులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. సొసైటీ చైర్మన్‌ సంకా బత్తుల వెంకట్‌, అమల్‌దాస్‌, రవిబాబు, వేణు పాల్గొన్నారు. 

ఉయ్యూరులో..

   ఉయ్యూరు  : భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి పురస్కరించుకుని పలు ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పలు వురు పూలమాలవేసి నివాళులర్పించారు. ఉయ్యూరు శాఖా గ్రంథాలయంలో నగర పంచాయతీ చైర్మన్‌ వల్లభనేని సత్యనా రాయణ, వైస్‌ చైర్మన్‌ సురేష్‌బాబు తదితరులు అంబేడ్కర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిం చారు. కడవకొల్లు పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్‌  ఏసుపాదం తదితరులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

కంకిపాడులో..

  కంకిపాడు : అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా పని చేస్తుం దని టీడీపీ మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతిని మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ దళితుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించి డబ్బులు లబ్ధిదారులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి కల్పించాలని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండవీటి శివయ్య, రంజిత్‌, అన్నే రామారావు, డీఎన్‌ఆర్‌, చలవాది రాజా, వణుకూరు విక్రం, షేక్‌ సలీం, సుబ్బారావు, శివపార్వతి, స్టాలిన్‌ పాల్గొన్నారు. 

జనసేన ఆధ్వర్యంలో..  జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమంలో పులి కామేశ్వరరావు, ముప్పా రాజా, బాయిన నాగరాజు, పచ్చిపాల శేఖర్‌, గుంటా గంగాధర్‌, పిచుక క్రాంతి, మేరుగు రాజు. టీవీ స్వామి, అజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

కంకిపాడు పంచాయతీ ఆధ్వర్యంలో..  కంకి పాడు పంచాయతీ కార్యా లయంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీడీవో కొడాలి అనురాధ, సర్పంచ్‌ బాకి రమణ, ఉపసర్పంచ్‌ రాచూరి చిరంజీవి, ఈవో రామకృష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రజాపోరాట సమితి ఆధ్వర్యంలో..  ప్రజా పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంబే డ్కర్‌ వర్థంతి కార్యక్రమంలో మువ్వల అన్వేష్‌, సిరి వెళ్ల చిట్టిబాబు, లంకా శ్రీనివాసరావు, బట్టు నాగ రాజు, ప్రసాద్‌, గెడ్డడా వరుణ్‌  పాల్గొన్నారు. 

విజయవాడ రూరల్‌ మండలంలో..

విజయవాడ రూరల్‌  : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడ రూరల్‌ మండలంలోని పలు గ్రామాలలో ఆయనకు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. అన్ని గ్రామాల్లోనూ ప్రజా ప్రతినిధులు, అధికారులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. నిడమానూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జడ్పీటీసీ సభ్యుడు కాకర్లమూడి సువర్ణరాజు, గొల్లపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు), నిడమానూరు సర్పంచ్‌ శీలం రంగారావు తదితరులు అంబేడ్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిమి రమేష్‌, సమ్మెట సాంబశివరావు, పరిమి విష్ణు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. నున్నలో జరిగిన కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్‌ అవుతు శ్రీశైలజ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి, సర్పంచ్‌ కాటూరి సరళ, ఎంపీటీసీ సభ్యులు పోలారెడ్డి ప్రసాద్‌రెడ్డి, బొంతు సరోజిని, ప్రత్తిపాటి రవీంద్ర (నాని), పెండెం గిరిజాకుమారి, పీఏసీఎస్‌ అధ్యక్షుడు పోలారెడ్డి చంద్రారెడ్డి, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్యం రాజు, సీపీఎం కార్యదర్శి గుంటక చిన వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి జీటీవీ రమణ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే మండలంలోని పాతపాడు, పీ నైనవరం, అంబాపురంలో జరిగిన కార్యక్రమాలలో సర్పంచ్‌లు సుజాత, గండికోట సీతయ్య తదితరుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి జరిగింది. రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, గూడవల్లిలోనూ అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నున్నలో ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమం జరగ్గా మందా వేణుబాబు మాదిగ, అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

హనుమాన్‌జంక్షన్‌లో..

  హనుమాన్‌జంక్షన్‌ :   బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని హనుమాన్‌జంక్షన్‌లో పలువురు రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు  సోమవారం నివాళులర్పించి ఆయన జాతికి అందించిన రాజ్యాంగ ఫలాలను గుర్తుచేశారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ  వై.నగేష్‌, ఎంపీడీవో  పీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాపులపాడు గ్రామంలో టీడీపీ నేతలు దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్‌, అట్లూరి శ్రీనివాసరావు,  మూల్పూరి సాయి కల్యాణి, మండాది రవీంద్ర, కాకుల శ్రీనివాసరావు, వీరమాచినేని బుజ్జి, తుమ్మల జగన్‌ తదితరులు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతాళ శరత్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌  వర్ధంతిని నిర్వహించారు. మాలమహానాడు కార్యకర్తలు. నాయకులు పాల్గొన్నారు. 

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌లో..

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ : ప్రతి పౌరుడూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి సమష్టి కృషి చేయాలని  వైస్‌ ఎంపీపీ పండు రాణి, రాష్ట్ర సాగునీటి సమాఖ్య అధక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, వీరవల్లి సర్పంచ్‌ పిల్లా అనిత వేర్వేరు కార్యక్రమాలలో తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ గ్రామాలలో సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహిం చారు.  వీరవల్లిలో అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిం చిన కార్యక్రమంలో సర్పంచ్‌ పిల్లా అనిత పాల్గొని నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకుడు మండాది రవీంద్ర, అలుగుల దేవా, దగాని సాగర్‌, తొమ్మండ్రు జోజి, మాజీ సర్పంచ్‌ పిల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. పెరికీడులోని అంబేడ్కర్‌ విగ్రహానికి వైస్‌ ఎంపీపీ పండు రాణి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ తవ్వా మూర్తి, ప్రత్తిపాటి జోగేశ్వ రరావు, తదితరులు పాల్గొన్నారు. రంగన్నగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర సాగునీటి సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, ఎంపీటీసీ పుసులూరి లక్ష్మీనారాయణ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమిటీ సభ్యులు కనకవల్లి శేషగిరిరావు, దోమవరపు అజయ్‌, తలారి జాన్‌ కోటయ్య, కసుకుర్తి అర్జునరావు, కొలుసు గంగాజలం పాల్గొన్నారు. కానుమోలు, తిప్పనగుంట,   అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.