అంబేడ్కర్‌ పేరున పోస్టల్‌ కవర్‌ విడుదల

ABN , First Publish Date - 2020-11-27T04:56:23+05:30 IST

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ పేరుతో రూపొందించిన పోస్టల్‌ కవర్‌ను గురువారం డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ విడుదల చేశారు.

అంబేడ్కర్‌ పేరున పోస్టల్‌ కవర్‌ విడుదల
పోస్టల్‌ కవర్‌ విడుదల చేస్తున్న డీఆర్‌ఎం తదితరులు

దొండపర్తి, నవంబరు 26: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ పేరుతో రూపొందించిన పోస్టల్‌ కవర్‌ను గురువారం డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ విడుదల చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌ ఒకటో నంబరు ప్లాట్‌ఫాంపై నిర్వహించిన కార్యక్రమంలో పోస్టల్‌ సిబ్బందితో కలిసి ఆయన ఈ కవరు విడుదల చేశారు. ఈ సందర్భంగా చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ గతంలో ఓసారి విశాఖ నుంచి తుని వరకు రైలులో ప్రయాణించిన సందర్భంగా ఆయన పేరున కవర్‌ విడుదల చేశామని, ఇది రెండవదన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్‌ అధికారులు, రైల్వే అధికారులు, రెండు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:56:23+05:30 IST