అంబేద్కర్‌ ఆశయ సాధనకు శ్రమించాలి

ABN , First Publish Date - 2021-10-18T04:36:41+05:30 IST

అంబేద్కర్‌ ఆశయ సాధనకు శ్రమించాలి

అంబేద్కర్‌ ఆశయ సాధనకు శ్రమించాలి
ఘట్‌కేసర్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మాజీ సర్పంచ్‌ స్టివేన్‌, తదితరులు

ఘట్‌కేసర్‌: నేటి యువత అంబేద్కర్‌ కళలుగన్న నవ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాలని ఎన్‌ఎ్‌ఫసీనగర్‌ మాజీ సర్పంచ్‌ పోతబత్తిని స్టివేన్‌ అన్నారు. ఘట్‌కేసర్‌లో ఆదివారం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగంతోనే నేడు దళిత, బడుగు బలహీన వార్గాలకు చెందిన విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రాణించగలుగుతున్నారని వివరించారు. సమాజంలో మతాలు, కులాలు, కట్టుబాట్లు మనుషులను బందీలను చేయకుండా ఉండాలన్నారు. కార్యక్రమంలో మీసాల అరుణ్‌ కుమార్‌, మేకల దాస్‌, నర్సింహ, రాందాస్‌, బాలయ్య, నర్సింగ్‌ రావు, ఆనంద్‌, దుర్గాప్రసాద్‌, ఉదయ్‌ కిరణ్‌, రాకేష్‌, నిఖిల్‌, ఉపేందర్‌, నితిన్‌, అకిల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:36:41+05:30 IST