అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-11-27T05:06:06+05:30 IST

అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాల ని మహగాం ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ఏఏ ఖయ్యూం అన్నారు.

అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
ఆదిలాబాద్‌లో నివాళులర్పిస్తున్న నాయకులు

భైంసా రూరల్‌, నవంబరు 26 : అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాల ని మహగాం ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ఏఏ ఖయ్యూం అన్నారు. పాఠశా లలో అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రతిజ్ఞ చేశారు. అ నం తరం మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రాసిన గొప్ప మేధావి అని అన్నారు. 

లోకేశ్వరం: స్థానిక తహసీల్‌ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వే డుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 

కుంటాల : అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ ది నోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూల మా లలు వేసి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్‌ మాట్లాడారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దిగంబ ర్‌, మండల అధ్యక్షుడు మట్ట కరుణాకర్‌ పాల్గొన్నారు.

ముథోల్‌ : మండల కేంద్రంలో భీమ్‌ఆర్మీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినో త్సవం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు దిగంబర్‌చందనే, సనీ ల్‌, ధమ్మపాల్‌, నారాయణ, రాజేశ్వర్‌, అనిల్‌ పాల్గొన్నారు.

లక్ష్మణచాంద : పాఠశాలలు, కళాశాలలు, సంఘాల ఆధ్వర్యంలో అంబే ద్కర్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం లో ఎంఈవో మధుసూదన్‌ పాల్గొన్నారు. 

ఖానాపూర్‌ : అణగారిన వర్గాలకు న్యాయం జరుగాలంటే ప్రజలంతా సంఘటితం కావాలని ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘ్‌ రాష్ట్ర అ ఽఽధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పాతబస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జాదవ్‌ వెంకట్‌రావు, ద్యావతి రా జేశ్వర్‌, నేత శ్యాం పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అంబేద్క ర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రి న్సిపాల్‌ రజిత, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.

దస్తూరాబాద్‌ : మండల కేంద్రం పాటు అన్ని గ్రామాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాల ని కోరారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

దిలావర్‌పూర్‌ : గుండంపల్లిలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్‌సీసీ అధికారి విజయ్‌ కుమార్‌ భారత రాజ్యాంగ విశిష్టత, గొప్పతనా న్ని వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్‌ పాల్గొన్నారు. 

నిర్మల్‌ కల్చరల్‌ : రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలందిస్తా మని ఏఎస్పీ రాంరెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భారత రా జ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. పోలీసులతో ప్రతిజ్ఞ చేయించారు. ఏ వో వెంకటశేఖర్‌, ఆర్‌ఐ వెంకటి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు జయరాం నాయక్‌ పాల్గొన్నారు. నిర్మల్‌లోని పోస్టల్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ యూ నియన్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. స్థానిక ఆజాద్‌ చౌరస్తాలో కలాంగణం సొసైటీ ఆధ్వర్యం లో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షుడు మహ్మద్‌ ఉస్మాన్‌, ముత్తన్న, ఫయాజ్‌ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం దినోత్సవాన్ని జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. జ డ్పీ మాజీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, హార్టికల్చర్‌ అధికారి శరత్‌, వ్యవ సాయ అధికారి అంజిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉట్నూర్‌ (నార్నూర్‌) : రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్‌ యువ ఫో రం మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రశేఖ ర్‌, సునీల్‌, నవీన్‌, కేశవ్‌, చంద్రపాల్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

ఉట్నూర్‌: స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్‌ చిత్రపటానికి ఎంపీడీవో తిరుమలతో కలిసి ఎంపీపీ పంద్రజైవంత్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ చౌరస్తాలో దళిత ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తలమడుగు : మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించా రు. ఈ  కార్యక్రమంలో సీఐ జానీ నర్సింలు, హాజరయ్యారు. జిల్లా మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సూరంభగవండ్లు, ప్రధాన కార్యదర్శి అల్లూరి భూమ న్న, అసోసియేట్‌ అధ్యక్షుడు కాడే స్వామి, సురేందర్‌ పాల్గొన్నారు.

ఇంద్రవెల్లి : స్థానిక పంచాయతీ ఆవరణలో సర్పంచ్‌ కోరేంగ గాంధారిసుంకట్‌రావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీడీ వో కార్యాలయంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ అర్కా పుష్పలత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఆదిలాబాద్‌టౌన్‌ : జిల్లాకేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్టు భవనంలో స్వేరోజ్‌ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నాందెవ్‌కాంబ్లె మాట్లాడారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్‌ డాక్టర్‌ రవికిరణ్‌, స్వేరోజ్‌ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, టీజీపీఏ జి ల్లా అధ్యక్షుడు అస్తక్‌సుభాష్‌, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్‌ కా ర్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ గణేష్‌రెడ్డి, జడ్పీ సీఈవో కిషన్‌ పాల్గొన్నారు.

నేరడిగొండ: రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండాలని ఎంపీపీ రాథోడ్‌ సజన్‌ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వ హించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీదేవి, ఎంపీడీవో అబ్దుల్‌ సమద్‌, డిప్యుటీ తహసీల్దార్‌ సమీర్‌ పాల్గొన్నారు.

బోథ్‌ : అంబేద్కర్‌ యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్క ర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. సోనాల, దన్నూర్‌లో అంబేద్కర్‌ వి గ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సం ఘం మండల అధ్యక్షుడు నల్ల చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి కంది ప్రవీణ్‌, ఎంపీటీసీ కుర్మె మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

గుడిహత్నూర్‌ : మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో మస్కేమాదవ్‌, బుద్దెగోవింద్‌, సిద్ధార్త్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T05:06:06+05:30 IST