అభివృద్ధే ఆశయంగా అడుగులు

ABN , First Publish Date - 2022-08-16T06:29:43+05:30 IST

జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆశయంగా ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ, జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

అభివృద్ధే ఆశయంగా అడుగులు
జెండా వందనం చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట 

అనంతను అగ్రస్థానంలో నిలుపుదాం

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి 

అధికారులు, ఉద్యోగులకు పురస్కారాలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


అనంతపురం టౌన, ఆగస్టు15: జిల్లా అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ఆశయంగా ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ, జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలకు ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు కలెక్టర్‌ నాగలక్ష్మి, డీఐజీ రవిప్రకాష్‌, ఎస్పీ ఫక్కీరప్పతోపాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి వేదికపైకి వచ్చి జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కరువు జిల్లాగా పేరొందిన అనంతను అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా, పీఎం కిసాన కింద జిల్లాలో 2.87 లక్షల కుటుంబాలకు రూ.387 కోట్లు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశామన్నారు. 2294 మంది కౌలు రైతులకు పంటసాగు పత్రాలు అందించామన్నారు. 2021 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా పథకం కింద 2.32 లక్షల మందికి రూ.629 కోట్లు జమ చేశామన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి, ఆదుకున్నామన్నారు. ఖరీ్‌ఫలో రాయితీతో రైతులకు 82 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనం పంపిణీ చేశామన్నారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత అందజేస్తున్నామన్నారు. పండ్ల తోటల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. త్వరలో డ్రిప్‌ అందజేస్తామన్నారు నవరత్నాల్లో భాగంగా వృద్ధులు, చేనేతలు, వితంతువులు, కళాకారులకు జిల్లాలో ప్రస్తుతం 272564 మందికి ఫించన్లు ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది కొత్తగా 14826 మందికి మంజూరుచేశామన్నారు. చేయూత, ఆసరా, సున్నావడ్డీ పథకం, వైఎ్‌సఆర్‌ బీమా, ఆరోగ్యశ్రీ, కంటివెలుగు పథకాల ద్వారా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదుకుంటున్నామన్నారు. అమ్మఒడి ద్వారా 1 నుంచి 12వ తరగతి వరకు నిరుపేద విద్యార్థులకు నగదు అందించి చదివిస్తున్నామన్నారు. పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలో వివిధ నీటి కాలవల అధునీకరణకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పథకాలను విజయవంతంగా నడిపిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇదే స్ఫూర్తితోనే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించేందుకు ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. అభివృద్ధిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, మేయర్‌ వసీం, జేసీ కేతనగార్గ్‌, డీఆర్‌ఓ గాయత్రీదేవి, ఆనసెట్‌ సీఈఓ కేశవనాయుడు, ఆర్డీఓలు మధసూదన, నిషాంతరెడ్డి, రవీంద్ర, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

సేవా పురస్కారాలు

జిల్లాలో ఆయా శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. 49 మంది అధికారులు, 304 మంది వివిధ శాఖల ఉద్యోగులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మి చేతుల మీదుగా అవార్డులు అందజేసి, అభినందించారు.


అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 15 : దేశభక్తిని చాటిచెప్పే గీతాలు... జాతి ఔన్నత్యాన్ని తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలు... ఎటుచూసినా సంబరమే.. సోమవారం స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో కనిపించిన దృశ్యాలివి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్‌ ప్రదర్శన ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా శకటాల విభాగంలో దిశ, అగ్నిమాపకశాఖ, గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయం, డ్వామా, విద్యాశాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా-నీటి పారిశుధ్య శాఖ, పంచాయతీరాజ్‌, పశుసంవర్ధక శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో డ్వామా శకటం ప్రథమ, స్వచ్ఛ సంకల్పం శకటం ద్వితీయ, గృహనిర్మాణశాఖ శకటం తృతీయ బహుమతులను గెల్చుకున్నాయి. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో స్వాతంత్య్ర సమరయోధులను కొనియాడుతూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కూడేరు కేజీబీవీ చిన్నారులు నింగిఒంగి.. నేలపొంగి, పామిడికి చెందిన ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్థులు దేశకి రంగీలా, గార్లదిన్నె కేజీబీవీ చిన్నారులు పాడుదమా స్వేచ్ఛా గీతానికి నృత్యాలు ప్రదర్శించి, ప్రేక్షకులను మైమరిపించారు. వివిధ శాఖలు.. తమ పథకాలు, అభివృద్ధిపై పోటాపోటీగా శకటాలు ఏర్పాటు చేసి వేడుకల్లో ప్రదర్శించడం ఆకట్టుకుంది. పోలీసు జాగిలాలు వేడుకల్లో ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. అనంతనరం జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు.












Updated Date - 2022-08-16T06:29:43+05:30 IST