ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పిన అంబులెన్స్‌

ABN , First Publish Date - 2021-05-15T04:53:53+05:30 IST

పి.కోనవలస సమీపంలోని ఘాట్‌ రోడ్డులో శుక్రవారం అంబులెన్స్‌ అదుపు తప్పింది. ఏకంగా ఘాట్‌ రోడ్డులో రక్షణ గోడపై ఇరుక్కుపోయింది. వంద నెంబర్‌కు ఫోన్‌ చేయడంతో ఎస్‌ఐ గంగరాజు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఎక్స్‌కవేటర్‌ సాయంతో అంబులెన్స్‌ను బయటకు తీశారు.

ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పిన అంబులెన్స్‌
ఎక్స్‌కవేటర్‌ సాయంతో అంబులెన్స్‌ను తీస్తున్న పోలీసులు

త్రుటిలో తప్పిన ప్రమాదం

పాచిపెంట, మే 14 :  పి.కోనవలస సమీపంలోని ఘాట్‌ రోడ్డులో శుక్రవారం అంబులెన్స్‌ అదుపు తప్పింది. ఏకంగా ఘాట్‌ రోడ్డులో రక్షణ గోడపై ఇరుక్కుపోయింది.    వంద నెంబర్‌కు ఫోన్‌ చేయడంతో ఎస్‌ఐ గంగరాజు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని ఎక్స్‌కవేటర్‌ సాయంతో అంబులెన్స్‌ను బయటకు తీశారు.  ఒడిశాకు చెందిన కొవిడ్‌ బాధితుడు మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో విశాఖ వెళ్తుండగా ఈ ప్రమా దం జరిగింది. పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిని అదే అంబులెన్స్‌లో విశాఖ పంపించారు.  


 

 

Updated Date - 2021-05-15T04:53:53+05:30 IST