పార్దివ దేహాల తరలింపు అంబులెన్స్‌కు ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-09T23:07:06+05:30 IST

తమిళనాడులోని కూనూరు వద్ద బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో

పార్దివ దేహాల తరలింపు అంబులెన్స్‌కు ప్రమాదం

చెన్నై : తమిళనాడులోని కూనూరు వద్ద బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి పార్దివ దేహాలను తరలిస్తున్న వాహనాల్లో ఓ వాహనం గురువారం ప్రమాదానికి గురైంది. వెల్లింగ్టన్ నుంచి సూలూరు వెళ్తుండగా ఓ వాహనం యాక్సిల్ విరిగిపోవడంతో ఓ గోడకు ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. 


ఈ పార్దివ దేహాలను వెల్లింగ్టన్‌లోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి గురువారం ఉదయం తరలించారు. ఈ అంబులెన్సులు, పోలీసు వాహనాలలోని ఓ వాహనం యాక్సిల్ విరిగిపోవడంతో రోడ్డు పక్కన ఉన్న ఓ గోడకు ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలోని ఏడుగురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని మెట్టుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వాహనంలోని పార్దివ దేహాలను వేరొక అంబులెన్సులో సూలూరు తరలిస్తున్నారు. 


బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-12-09T23:07:06+05:30 IST