ఏపీ సినిమా (రెగ్యులరైజేషన్) రూల్స్‌కి సవరణలు

ABN , First Publish Date - 2021-07-07T02:18:55+05:30 IST

ఏపీ సినిమా (రెగ్యులరైజేషన్) రూల్స్ 1970కి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం

ఏపీ సినిమా (రెగ్యులరైజేషన్) రూల్స్‌కి సవరణలు

అమరావతి: ఏపీ సినిమా (రెగ్యులరైజేషన్) రూల్స్ 1970కి సవరణలు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్సింగ్ అథారిటీ తమ లైసెన్సు రెన్యువల్ చేసుకునే సమయంలో ఇచ్చే ఫాం బీ ద్వారా వివిధ క్లాసుల టిక్కెట్ల రేట్లను నిర్ణయించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ టిక్కెట్ రేట్లను టైం టూ టైం మార్చుకునే విధంగా ప్రభుత్వానికి వెలుసుబాటు ఇస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేసారు. సవరణలు ఏప్రిల్ 8, 2021 నుంచి అమల్లోకి వస్తాయని ఉత్తర్వులలో వెల్లడించారు. 

Updated Date - 2021-07-07T02:18:55+05:30 IST