అత్యవసర వేళ.. రోగులకు ప్రాణవాయువు!

ABN , First Publish Date - 2021-05-07T06:53:32+05:30 IST

ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేని అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ప్రాణవాయువు అందిస్తాయని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు.

అత్యవసర వేళ.. రోగులకు  ప్రాణవాయువు!
కలెక్టర్‌ సమక్షంలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందజేస్తున్న సేఫ్‌వే కన్‌సెషన్స్‌ సంస్థ ప్రతినిధులు

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఎంతో దోహదం :   కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 

రూ.5 లక్షల విలువైన 9   కాన్సంట్రేటర్లను అందజేసిన     సేఫ్‌వే కన్‌సెషన్స్‌ సంస్థ

జీజీహెచ్‌ (కాకినాడ), మే 6: ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో లేని అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ప్రాణవాయువు అందిస్తాయని జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి అన్నారు. గురువారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చేతులమీదుగా రూ.5 లక్షల విలువైన 9 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సేఫ్‌వే కన్‌సెషన్స్‌ సంస్థ ప్రతినిధులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటబుద్ధకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న సంక్లిష్ట పరిస్థితిలో ఉన్న రోగుల ప్రాణాలను రక్షించేందుకు ఇవి గాలి ద్వారా ఆక్సిజన్‌ అం దించి ప్రాణాలు నిలుపుతాయన్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. ఇంతటి విపత్తు సమయంలో సామాజిక బాధ్యతగా ఆక్సిజన్‌ కాన్సంట్రెటర్లు అందించిన సేఫ్‌వే కన్‌సెషన్స్‌ సంస్థను కలెక్టర్‌ అభినందించారు. ఒక్కో ఆక్సిజన్‌ కాన్సంట్రెటర్‌ 5 లీటర్ల సామర్థ్యంతో పని చేస్తుందని, 9 పరికరాలను సుమారు 5 లక్షలతో కొనుగోలు చేసినట్టు సేఫ్‌వే కన్‌సెషన్స్‌ సంస్థ చీఫ్‌ మేనేజర్‌ ఎం.ఫణికుమార్‌, మేనేజర్‌ కేవీవీఎస్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. తుని, రామచంద్రపురం, అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రులకు రెండేసి కాన్సంట్రెటర్స్‌లను అందించడం జరుగుతుందన్నారు. ఈ కాన్సంట్రేటర్‌ ద్వారా రోగికి ఆక్సిజన్‌ అందిం చి ప్రాణాలు కాపాడవచ్చని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటబుద్ధ తెలిపారు. కార్యక్రమంలో జేసీ కీర్తి చేకూరి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, ఆర్‌ఎంవో డా. గిరిధర్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-07T06:53:32+05:30 IST