ప్రయాణికులతో కిటకిటలాడుతున్న విమానాశ్రయాలు

ABN , First Publish Date - 2021-07-20T22:15:59+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దేశీయ ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కరోనా ప్రభావం అనంతరం ఎప్పుడూ లే

ప్రయాణికులతో కిటకిటలాడుతున్న విమానాశ్రయాలు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలోని విమానాశ్రయాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దేశీయ ప్రయాణాలు, విహార యాత్రలు పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.  కరోనా ప్రభావం అనంతరం ఎప్పుడూ లేనంత రద్దీ గత వారాంతంలో కనిపించింది. ఆదివారం అన్ని విమానాశ్రయాల్లో 22 లక్షల మందికి పైగా ప్రయాణికుల స్క్రీనింగ్‌ జరిగిందని అమెరికా రవాణా భద్రతా విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది మార్చి తర్వాత ఇదే అత్యధికమని వెల్లడించింది. అయితే 2019 నాటికి ఇదే సమయానికి ఉన్న రద్దీతో పోలిస్తే 18% తక్కువేనని వివరించింది. 


Updated Date - 2021-07-20T22:15:59+05:30 IST