టీకా పొందినవారికి అమెరికాలోకి అనుమతి

ABN , First Publish Date - 2021-10-17T08:15:18+05:30 IST

అత్యవసరమైతే తప్ప విదేశీయులను రానివ్వని అమెరికా తాజాగా ఆంక్షలను సడలించింది. కొవిడ్‌ టీకా రెండు డోసులూ పొందినవారిని ..

టీకా పొందినవారికి అమెరికాలోకి అనుమతి

వాషింగ్టన్‌, అక్టోబరు 16: అత్యవసరమైతే తప్ప విదేశీయులను రానివ్వని అమెరికా తాజాగా ఆంక్షలను సడలించింది. కొవిడ్‌ టీకా రెండు డోసులూ పొందినవారిని నవంబరు 8నుంచి తమ దేశంలోకి అనుమతి ఇస్తున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. దీంతో భారత్‌, యూకే, చైనా సహా పలు దేశాలకు చెందినవారు అమెరికా వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది. కాగా, అమెరికాలో హై రిస్క్‌ వారికి ఫైజర్‌ టీకా బూస్టర్‌ పంపిణీ గత నెలలో ప్రారంభమైంది.



వచ్చే వారం.. వంద కోట్ల టీకా మైలురాయికి

దేశంలో 100 కోట్ల మందికి టీకాల పంపిణీ వచ్చే వారం పూర్తి కానుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఇప్పటివరకు 97.23 కోట్ల మందికి కనీసం ఒక డోసు అందిందన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలను తొలగిస్తూ గాయకుడు కైలాష్‌ ఖేర్‌ ఆలపించిన ‘‘టీకా గీతాన్ని’’ ఆయన ఆవిష్కరించారు. దేశంలో శనివారం 15,981 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. 166 మంది మృతి చెందారు. రష్యాలో కరోనా మరణాలు తొలిసారి వెయ్యి దాటాయి. కొవిడ్‌తో శనివారం 1,002 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-10-17T08:15:18+05:30 IST