కాల్‌సెంటర్‌ స్కామ్‌లపై మేల్కొన్న అమెరికా

ABN , First Publish Date - 2021-10-23T08:09:49+05:30 IST

అమెరికాలో జరుగుతున్న కాల్‌సెంటర్‌ స్కామ్‌లపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎ్‌ఫడీఐ), న్యాయశాఖలు ఎట్టకేలకు స్పందించాయి....

కాల్‌సెంటర్‌ స్కామ్‌లపై మేల్కొన్న అమెరికా

వాషింగ్టన్‌, అక్టోబరు 22: అమెరికాలో జరుగుతున్న కాల్‌సెంటర్‌ స్కామ్‌లపై ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎ్‌ఫడీఐ), న్యాయశాఖలు ఎట్టకేలకు స్పందించాయి. ఈ రెండు విభాగాల అధికారులు భారత్‌లోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐతో ఇటీవల సమావేశమయ్యారు. పెరుగుతున్న నేరాల నియంత్రణకు, సైబర్‌ ఆర్థిక నేరాలు.. ముఖ్యంగా టెలీమార్కెటింగ్‌/కాల్‌సెంటర్‌ మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో సీబీఐ సహకారం కావాలని కోరారు. కాగా.. గడిచిన దశాబ్ద కాలంగా అమెరికాలో జరుగుతున్న కాల్‌సెంటర్‌ మోసాలకు భారత్‌లోని పలు ప్రాంతాలు ప్రధాన కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. పలు కేసుల్లో భారత సంస్థలు ఇక్కడ నిందితులను అరెస్టు చేసిన సందర్భంలో.. అమెరికాకు ఈ మోసాలను గురించి వివరించడం గమనార్హం.

Updated Date - 2021-10-23T08:09:49+05:30 IST