అరుదైన వ్యాధితో బాధపడుతున్న 4నెలల చిన్నోడు.. ఏ మాత్రం జాలి చూపని నెటిజన్లు..

ABN , First Publish Date - 2021-08-21T01:01:32+05:30 IST

అమెరికాకు చెందిన నాలుగు నెలల చిన్నోడు అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ బుడ్డోడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భయంకరంగా కామెంట్ చేస్తున్నారు. ఆ

అరుదైన వ్యాధితో బాధపడుతున్న 4నెలల చిన్నోడు.. ఏ మాత్రం జాలి చూపని నెటిజన్లు..

వాషింగ్టన్: అమెరికాకు చెందిన నాలుగు నెలల చిన్నోడు అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ బుడ్డోడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భయంకరంగా కామెంట్ చేస్తున్నారు. ఆ చిన్నారిని ‘బేబీ గోరిల్లా’గా అభివర్ణించడమే కాకుండా.. ఏ మాత్రం జాలి చూపించడం లేదు. ఆ పసికందును బయటపడేయాలంటూ తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌కు చెందిన మేటియో హెర్నాండెజ్.. పుట్టిన నెలకే కాంజెనిటల్ హైపర్ఇన్సులినిజమ్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డాడు. దీంతో ఆ చిన్నారి శరీరంలో వణుకు మొదలైంది. అంతేకాకుండా ఆ చిన్నోడు మోతాదుకు మించి తింటుండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఈ క్రమంలో ఆందోళనకుగురయ్యారు. వెంటనే డాక్టరును సంప్రదించారు. వైద్య పరీక్షలన్నీ పూర్తైన తర్వాత.. చిన్నారి కాంజెనిటల్ హైపర్ఇన్సులినిజమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. కాంజెనిటల్ హైపర్ఇన్సులినిజమ్ బాధపడే పిల్లల్లో.. ఇన్సులిన్ అధిక మోతాదులో ఉత్పత్తి అవుతుందని.. దీని ద్వారా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. 



డాక్టర్ నోటి వెంట వచ్చిన మాటలను విన్న మేటియో హెర్నాండెజ్ తల్లిదండ్రులు.. చిన్నారిని టెక్సాస్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ క్రమంలో వైద్యులు చికిత్సను కూడా ప్రారంభించారు. రెండు వారాల్లో మేటియో హెర్నాండెజ్ ఆరోగ్యం కాస్త మెరుగైంది. అయితే తమ కుమారుడి ఆరోగ్యం కుదుటపడుతుందన్న సంతోషం ఆ తల్లిదండ్రుల్లో ఎక్కువ కాలం నిలవలేదు. చికిత్సలో భాగంగా వైద్యులు ఇస్తున్న మెడిసిన్స్ కారణంగా మేటియో హెర్నాండెజ్ శరీరంలో క్రమంగా మార్పులు మొదలయ్యాయి. అధిక మొత్తంలో నల్లటి వెంట్రుకలు ఉత్పన్నమై బాబు శరీరాన్ని కప్పేశాయి. దీంతో మేటియో హెర్నాండెజ్ తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.


అనంతరం తమ అనుభవాలను వివరిస్తూ మేటియో హెర్నాండెజ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘కాంజెనిటల్ హైపర్ఇన్సులినిజమ్ కోసం చికిత్స తీసుకుంటే.. బాబు శరీరంలో అధిక మొత్తంలో వెంట్రుకలు మొలుస్తాయని డాక్టర్లు ముందే చెప్పారు. అయితే వారి సూచనలను లైట్‌గా తీసుకున్నాం. ప్రస్తుతం మా బాబు పరిస్థితి ఇలా ఉంది’ అని పేర్కొంటూ ప్రజల్లో అవగాహన పెంపొందించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మేటియో హెర్నాండెజ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ చిన్నోడి ఫొటోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘బేబీ గోరిల్లా’గా అభివర్ణిస్తూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ చిన్నోడిపై కనీసం జాలి కూడా చూపకుండా.. ‘అతడిని అవతల పారేయండి’ అంటూ తల్లిదండ్రులకు సలహాలు ఇస్తున్నారు. 


Updated Date - 2021-08-21T01:01:32+05:30 IST