చైనాకు షాకిచ్చిన అమెరికా.. 44 విమాన సర్వీసులపై నిషేధం..

ABN , First Publish Date - 2022-01-23T02:38:18+05:30 IST

కొవిడ్ పేరుతో అమెరికా విమానయాన సంస్థల ఫ్లైట్ సర్వీసులను నిషేధించిన చైనాపై అమెరికా కూడా అదే స్థాయిలో స్పందించింది.

చైనాకు షాకిచ్చిన అమెరికా.. 44 విమాన సర్వీసులపై నిషేధం..

ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ పేరుతో అమెరికా విమానయాన సంస్థల ఫ్లైట్ సర్వీసులను నిషేధించిన చైనాపై అమెరికా కూడా అదే స్థాయిలో స్పందించింది. అమెరికా నుంచి చైనాకు ఫ్లైట్ సర్వీసులు నడుపుతున్న నాలుగు చైనా సంస్థలపై తాజాగా నిషేధం విధించింది. ఈ ఉత్తర్వుల ఫలితంగా జనవరి 30 నుంచి మొత్తం 44 విమాన సర్వీసులు రద్దుకానున్నాయి. మార్చి 29 వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే..అమెరికా తీరుపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం సబబు కాదని వ్యాఖ్యానించింది.

Updated Date - 2022-01-23T02:38:18+05:30 IST