Corona, swine flu: అమెరికా నుంచి వచ్చిన మహిళకు కరోనా, స్వైన్‌ ఫ్లూ

ABN , First Publish Date - 2022-08-02T15:54:13+05:30 IST

అమెరికా నుంచి పళనికి వచ్చిన మహిళకు కరోనా, స్వైన్‌ఫ్లూ(Corona, swine flu) లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నెల 20న అమెరికా నుంచి

Corona, swine flu: అమెరికా నుంచి వచ్చిన మహిళకు కరోనా, స్వైన్‌ ఫ్లూ

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 1: అమెరికా నుంచి పళనికి వచ్చిన మహిళకు కరోనా, స్వైన్‌ఫ్లూ(Corona, swine flu) లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నెల 20న అమెరికా నుంచి పళని వచ్చిన 41 ఏళ్ల మహిళ తంజావూరులో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. ఆమె అనారోగ్యానికి గురవడంతో కోయంబత్తూర్‌(Coimbatore)లోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. అదే సమయంలో ఆమెకు స్వైన్‌ ఫ్లూ(Swine flu) స్వల్ప లక్షణాలున్నట్లు వైద్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె పళనిలో తన ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు. ఆమె కుటుంబసభ్యులకు కరోనా, స్వైన్‌ ఫ్లూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

Updated Date - 2022-08-02T15:54:13+05:30 IST