అమెరికా ఎఫెక్ట్... భారీ నష్టాల్లో ‘స్టాక్ మార్కెట్’...

ABN , First Publish Date - 2021-03-04T21:15:16+05:30 IST

నిన్న(బుధవారం( భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు... నేడు(గురువారం) అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి వెళ్లాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్ల మేర నష్టంతో ప్రారంభమైంది.

అమెరికా ఎఫెక్ట్... భారీ నష్టాల్లో ‘స్టాక్ మార్కెట్’...

ముంబై : నిన్న(బుధవారం( భారీగా లాభపడిన స్టాక్ మార్కెట్లు... నేడు(గురువారం) అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల్లోకి వెళ్లాయి. ప్రారంభంలోనే  సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్ల మేర నష్టంతో ప్రారంభమైంది. ఆ తర్వాత అతి స్వల్పంగా మాత్రమే కోలుకోగలిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు మినహా అన్ని రంగాలూ నష్టాల్లోనే ఉన్నాయి. దాదాపు 5 శాతానికి పైగా పెరిగిన భారత్ విక్స్ సూచీ...  మార్కెట్‌లో ఆందోళనను పెంచింది. నిన్న అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. ప్రధానంగా టెక్నాలజీ షేర్ల విక్రయాలు, జాబ్ డేటా నిరాశాజనకంగా ఉండటంతో సూచీలు పతనమయ్యాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్ పై పడింది.


సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్...

నిన్న 51,445 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 640 పాయింట్ల మేర నష్టపోయి 50,812 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 50,957.29 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,539.92 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,026.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,101.05 వద్ద గరిష్టాన్ని, 14,980.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. అంటే నిఫ్టీ ఓ సమయంలో 15 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. మధ్యాహ్నం 1 గంటల సమయానికి సెన్సెక్స్ 604 పాయింట్లు నష్టపోయి 50,840 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 168 పాయింట్లు నష్టపోయి 15,076 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.


Updated Date - 2021-03-04T21:15:16+05:30 IST