కరోనా నుంచి కోలుకున్నాక మంకీపాక్స్....ఇతరులకూ వ్యాప్తి!

ABN , First Publish Date - 2021-07-17T17:19:16+05:30 IST

అమెరికాలో కరోనా వైరస్‌ మరో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది.

కరోనా నుంచి కోలుకున్నాక మంకీపాక్స్....ఇతరులకూ వ్యాప్తి!

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్‌ మరో ప్రమాదాన్ని తెచ్చిపెడుతోంది. టెక్సాస్‌కు చెందిన ఒక కరోనా బాధితుడు మంకీపాక్స్ బారినపడటం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. బాధితుని శరీరంపై పెద్దపెద్ద బొబ్బలు ఏర్పాడ్డాయి. యూఎస్‌లో ఇది తొలి కేసు అని వైద్యాధికారులు చెబుతున్నారు. 


ఇటీవల అమెరికా పౌరుడొకరు నైజీరియా వెళ్లి, తిరిగి టెక్సాస్‌కు వచ్చారు. ఇంతలో అతనికి మంకీపాక్స్ సోకడంతో ఆసుపత్రిలో చేరాడు. ఇది అరుదుగా వచ్చే వ్యాధి అని, ఆందోళనపడాల్సిన అవసరం వైద్యులు తెలిపారు. బాధితుడు చికిత్సతో త్వరగానే కోలుకుంటాడని పేర్కొన్నారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 1970లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ తరహా వైరస్ వ్యాపించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధి కలకలం రేపింది. కాగా ఈ బాధితునితో పాటు ప్రయాణించిన వారి జాబితాను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇతరులకు సోకే అవకాశం ఉన్న నేపధ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2021-07-17T17:19:16+05:30 IST