న్యూఢిల్లీ, జనవరి 31: పాకిస్థాన్‌కు అమెరికా పెద్ద షాకిచ్చింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో తమ దేశంలో పాకిస్థాన్ కొత్త రాయబారి మసూద్ ఖాన్ నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా కాంగ్రెస్ నేత స్కాట్ పెర్రీ.. ప్రెసిడెంట్ జో బైడన్‌కు రాసిన లేఖ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.