America: బిల్లు చెల్లించలేకపోయాడు.. అలాగని అందరిలా రాజీపడలేదు.. సొంతంగానే..

ABN , First Publish Date - 2022-08-18T00:49:29+05:30 IST

ఇంటర్నెట్.. దీన్ని ప్రస్తుతం అందరూ వినియోగించుకుంటున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వచ్చే ఆదాయంలో ప్రతి నెలా ఎంతో కొంత దీని కోసం కేటాయించాల్సిందే. డబ్బులు ఎంత పెట్టినా.. మన అవసరాలకు అనుగుణంగా ఇంటర్నెట్ వేగం లే

America: బిల్లు చెల్లించలేకపోయాడు.. అలాగని అందరిలా రాజీపడలేదు.. సొంతంగానే..

ఎన్నారై డెస్క్: ఇంటర్నెట్.. దీన్ని ప్రస్తుతం అందరూ వినియోగించుకుంటున్నారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వచ్చే ఆదాయంలో ప్రతి నెలా ఎంతో కొంత దీని కోసం కేటాయించాల్సిందే. డబ్బులు ఎంత పెట్టినా.. మన అవసరాలకు అనుగుణంగా ఇంటర్నెట్ వేగం లేకపోతే. చాలా అసంతృప్తికి గురవుతాం. ఇతర నెట్‌వర్క్‌లకు షిఫ్ట్ అయిపోతాం. అయితే.. అది తలకు మించిన భారం అయితే.. చేసేదేమీ లేక రాజీపడిపోతాం. కానీ ఓ వ్యక్తి మాత్రం.. అందరిలా రాజీ పడలేదు. ఏకంగా సొంతంగా సర్విస్ ప్రొవైడర్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో రివార్డును కూడా పొందాడు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..


అమెరికా(America)లోని మిచిగాన్‌(Michigan)కు చెందిన జారెడ్ మౌచ్(Jared Mauch) అనే వ్యక్తి అకామై(Akamai) అనే సంస్థలో కొద్ది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని కారణాల వల్ల 2002 నుంచి అతడు మారు మూల గ్రామంలోని  తన ఇంటి నుంచే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ పరంగా 1.5 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను అందించే టీ1 లైన్ (ట్రాన్సిమిషన్ కనెక్షన్) కనెక్షన్ తీసుకున్నాడు. ఇంతలో కాలం మారింది. దీంతోపాటే ఆ ఇంటర్నెట్ వేగం అతడి అవసరాలు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మౌచ్.. 50 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను అందించే వైర్‌లైస్ సర్వీస్ ప్రొవైడర్‌కు అప్‌గ్రేడ్ అయ్యాడు. అది కూడా అతడి అవసరాన్ని తీర్చ లేకపోయింది. దీంతో కామ్‌కాస్ట్ (Comcast) అనే సంస్థను సంప్రదించి.. తన ఇంటి వరకు ఇంటర్నెట్ సర్వీస్‌ను విస్తరించాలని కోరాడు. అతడి విన్నపానికి సానుకూలంగా స్పందించిన కామ్‌కాస్ట్.. ఇంటర్నెట్ సర్వీస్‌ను విస్తరించడానికి అంగీకరించింది. 



అయితే.. సర్వీస్‌ను విస్తరించేందుకు 50,000 డాలర్లు (సుమారు రూ.40లక్షలు) చెల్లించాలని మౌచ్‌ను కోరింది. దీంతో ఒక్కసారిగా అతడు షాకయ్యాడు. అంతమొత్తం కట్టలేనంటూ తన పరిస్థితిని వివరించాడు. ఇలా పలు మార్లు అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. అతడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. సొంతంగా తానే బ్రాడ్‌బ్యాండ్‌(Own Broadband)ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే తాను పని చేస్తున్న సంస్థ అకామై సహకారంతో ఏకంగా 1,45,000 డాలర్లు(దాదాపు రూ.కోటి) ఖర్చు చేసి Washtenaw ఫైబర్ ప్రాపర్టీస్ పేరుతో ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్ సంస్థను నెలకొల్పాడు. అంతేకాదు ప్రస్తుతం తాను ఏర్పాటు చేసిన సర్వీస్‌ ప్రొవైడర్ ద్వారా 70 మంది కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో యూఎస్ ప్రభుత్వం(US government) మౌచ్‌కు 2.6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. దీంతోపాటు బ్రాడ్‌బ్యాండ్ సేవలను 417 మంది కస్టమర్లకు అందించేలా ఒప్పందం కూడా కుదుర్చుకుంది.


ఈ నేపథ్యంలో మౌచ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘కామ్‌కాస్ట్ సంస్థ వాళ్లు ఇంటర్నెట్ సర్విస్ విస్తరించేందుకు 10వేల డాలర్లు అడిగితే ఇచ్చేవాడిని కానీ.. 50వేల డాలర్లు కావాలనే సరికి ఆలోచనలో పడ్డాను. సొంతంగా సర్వీస్ ప్రొవైడర్‌ను ఏర్పాటు చేశాను. ఇందుకోసం ఖర్చైన రూ.1,45,000 డాలర్లలో 95 వేల డాలర్లు(భారత కరెన్సీలో రూ.75లక్షలు) fiber conduits కోసం కాంట్రాక్టర్‌కు చెల్లించాను. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా.. అత్యంత తక్కువకే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఇస్తున్నా. కనెక్షన్‌ కోసం 199 డాలర్లు ఛార్జ్ చేస్తున్నా. అలాగే 100 ఎంబీపీఎస్ వేగంతో నెల మొత్తం అన్‌లిమిటెడ్ డాటాను కేవలం 55 డాలర్లే వసూలు చేస్తున్నా. అలాగే 1జీబీపీఎస్ డేటాకు కేవలం 79డాలర్లు/నెలకు ఛార్జ్ చేస్తున్నాను’ అని మౌచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-18T00:49:29+05:30 IST