ఆమెను అడిగే అలా చేశా.. విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడి సమాధానం ఇదీ..!

ABN , First Publish Date - 2022-04-06T23:23:32+05:30 IST

పక్కన మహిళా ప్రయాణికురాలు కూర్చొని ఉన్నప్పటికీ ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారనే ఆలోచన కూడా లేకుండా తన సీట్లోనే కూర్చుని పాడుపనికి ఒడిగట్టాడు. అంతేకా

ఆమెను అడిగే అలా చేశా.. విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడి సమాధానం ఇదీ..!

ఎన్నారై డెస్క్: పక్కన మహిళా ప్రయాణికురాలు కూర్చొని ఉన్నప్పటికీ ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారనే ఆలోచన కూడా లేకుండా తన సీట్లోనే కూర్చుని పాడుపనికి ఒడిగట్టాడు. అంతేకాకుండా.. అందరి ముందూ ఇదేం పని అధికారులు ప్రశ్నిస్తే.. నివ్వెరపోయే సమాధానాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



అమెరికాకు చెందిన ఆంటోనియో షెర్రోడ్ మెక్‌గారిటీ అనే వ్యక్తి శనివారం ఉదయం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో సీటెల్ నుంచి ఫీనిక్స్‌కు బయల్దేరాడు. విమానంలో 11ఎఫ్ సీటులో కూర్చున్న అతడు.. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సమయానికే అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. పక్క సీటు 11ఈలో ఓ మహిళా ప్రయాణికురాలు ఉన్నప్పటికీ.. హస్తప్రయోగం చేశాడు. 2.37గంటల జర్నీలో ఇళా నాలుగు సార్లు చేశాడు. దీంతో సదరు మహిళా ప్రయాణికురాలు.. ఆ  దృశ్యాలను తన ఫోన్‌లో బంధించింది. అంతేకాకుండా విమానం సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విమానం ఫీనిక్స్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే మెక్‌గారిటీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఈ సందర్భంగా చేసిన తప్పు ఒప్పుకున్న అతడు.. సదరు మహిళా ప్రయాణికురాలి అనుమతితోనే తాను అలా చేసినట్టు వెల్లడించాడు. అంతేకాకుండా ‘అది పెద్ద విషయమేమీ కాదు’ అన్నట్లు ఆమె సమాధానం ఇచ్చిందని చెప్పాడు. కాగా.. దీనిపై సీరియస్ అయిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం.. అతడిపై జీవితకాల నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. అతడు చేసిన తప్పుకు 90రోజుల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 




Updated Date - 2022-04-06T23:23:32+05:30 IST