
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రెంచ్ ఫ్రైస్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఉండరేమో. బంగాళదుంపలను నిలువుగా కట్ చేసి తయారు చేసే ఈ ఆహారపదార్థాన్ని చాలా మంది లొట్టలేసుకుని మరీ తింటారు. ఇపుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ టాపిక్ గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. అమెరికాలోని ఓ రెస్టారెంట్లో తయారువతున్న ఫ్రెంచ్ ఫ్రైస్ రికార్డు సృష్టించాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌గా ఏకంగా గిన్నీస్ వరల్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

న్యూయార్క్‌లోని సెరెండిపిటీ రెస్టారెంట్ క్రీమ్ డెలా క్రీమ్ పోమ్మెస్ ఫ్రైట్స్ (Crème dela Crème Pommes Frites) అని పిలిచే ప్రత్యేకమైన ఫ్రెంచ్ ఫ్రైస్ను తయారు చేస్తోంది. అంతేకాకుండా ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఏకంగా 200 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.15వేలు) వసూలు చేస్తోంది. ఈ క్రమంలో 2021లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్‌గా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లో వీటికి చోటు దక్కింది. వీటి తరయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారట. అంతేకాకుండా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌పై బంగారపు రేకులను కూడా చల్లుతారు. తాజాగా వీటిని ఓ వ్యక్తి ఫాస్ట్‌గా తినేసి.. ప్రపంచ రికార్డు సృష్టించాడు. అందుకు సంబంధించిన వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి