విదేశీ ప్రయాణికుల విషయంలో America సంచలన నిర్ణయం.. నవంబర్ నుంచే ఓకే..

Sep 21 2021 @ 07:31AM

e style="color: rgb(0, 0, 0); white-space: pre-wrap;">వాషింగ్టన్: విదేశీ ప్రయాణికులకు అమెరికా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఎలాంటి క్వారంటైన్ నిబంధనలూ లేకుండా దేశంలోనికి అనుమతించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ ప్రారంభం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు వైట్ హౌస్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రకారం.. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులూ తీసుకుని, దానికి సంబంధించిన సరైన ఆధారాలు కలిగి ఉన్న వారిని నవంబర్ ప్రారంభం నుంచి దేశంలోనికి అనుమతిస్తామని పేర్కొంది. వారికి ఎలాంటి క్వారంటైన్ నిబంధనలనూ ఉండవని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నా లేకపోయినా.. ఇంగ్లండ్, ఇండియా, చైనా, ఇరాన్, ఐర్లాండ్, బ్రెజిట్ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలనే నిబంధన అమెరికాలో ఉంది. అయితే తాజాగా వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయంతో ఆయా దేశాలకు చెందిన ప్రయాణికులకు గొప్ప ఉపశమనం లభించినట్లైంది.
Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.