Work permit Visa: అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం.. Indiansకు భారీ మేలు!

ABN , First Publish Date - 2022-05-04T19:02:33+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులతో పాటు వేలాది మంది ప్రవాసులకు ఊరటనిచ్చేలా గడువు ముగుస్తున్న వర్క్‌ పర్మిట్‌ వీసాల వ్యాలిడిటీని 18 నెలల పాటు పొడిగించింది. అయితే, ఇది కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే వర్తిస్తుంది.

Work permit Visa: అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం.. Indiansకు భారీ మేలు!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలోని జో బైడెన్ ప్రభుత్వం వలసదారులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులతో పాటు వేలాది మంది ప్రవాసులకు ఊరటనిచ్చేలా గడువు ముగుస్తున్న వర్క్‌ పర్మిట్‌ వీసాల వ్యాలిడిటీని 18 నెలల పాటు పొడిగించింది. అయితే, ఇది కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే వర్తిస్తుంది. Green Card కోసం ఎదురుచూస్తున్నవారితో పాటు ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ కార్డ్‌ (ఈఏడీ) కలిగిన H-1B వీసాదారుల భాగస్వాములకు ఇది వర్తిస్తుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ ప్రకటించింది. అలాగే ఈ నిర్ణయం మే 4 నుంచి అమల్లోకి వస్తుందని తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈఏడీల గడువు ముగిసిన తర్వాత కూడా 180 రోజుల వరకు వాటిని ఉపయోగించుకునే వీలుంది. అయితే, ఇప్పుడు దాన్ని 540 రోజులు (18నెలల వరకు) ఆటోమేటిక్‌గా పొడిగిస్తున్నట్లు యూఎస్‌ఐఎస్‌సీ వెల్లడించింది. US పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సేవలు (USCIS) వద్ద ఈఏడీల రెన్యూవల్‌కు దరఖాస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌ఐఎస్‌సీ డైరెక్టర్‌ ఎం. జద్దౌ వెల్లడించారు.


తాజా నిర్ణయంతో ఈఏడీ రెన్యూవల్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వలసదారులు తమ వర్క్‌ పర్మిట్ గడువు ముగిసిన కూడా మరో 540 రోజుల పాటు వాటిని ఉపయోగించుకుని పని అనుమతులు పొందవచ్చు. తాము తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా యూఎస్‌లో ఉద్యోగుల కొరతకు కొంతమేర బ్రేక్ వేయడంతో పాటు ప్రవాసుల ఫ్యామిలీలకు సైతం ఆర్థికంగా హెల్ప్ అవుతుందని బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. ఇక అగ్రరాజ్యం తాజాగా తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల దాదాపు 87వేల మంది వలసదారులకు తక్షణమే లబ్ధి చేకూరుతుందని భారతీయ అమెరికన్‌ కమ్యూనిటీ లీడర్ అజయ్ జైన్ భూటోరియా అన్నారు. అంతేగాక సుమారు 4.20లక్షల మంది ప్రవాసులు తమ పని అనుమతులు కోల్పోకుండా ఉద్యోగాల్లో కొనసాగవచ్చని పేర్కొన్నారు. ఇందులో అత్యధికులు భారతీయులేనని ఆయన తెలిపారు. అలాగే ప్రస్తుతం అమెరికాలో చాలా కంపెనీలు సిబ్బంది సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఈ నిర్ణయంతో ఇప్పుడు తమ అర్హతగల ఉద్యోగులను కొనసాగించుకోగలుగుతున్నందున ఇది సంస్థల యజమానులకు శుభవార్త అని భూటోరియా చెప్పుకొచ్చారు.

Read more