మాస్క్ ధరించేందుకు నిరాకరించిన విద్యార్థులు.. ఒక రోజు ఆలస్యమైన విమానం!

ABN , First Publish Date - 2021-07-07T16:12:04+05:30 IST

నార్త్ కరోలినా నుంచి బహామాస్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఏకంగా ఒక రోజు ఆలస్యమైంది.

మాస్క్ ధరించేందుకు నిరాకరించిన విద్యార్థులు.. ఒక రోజు ఆలస్యమైన విమానం!

వాషింగ్టన్: నార్త్ కరోలినా నుంచి బహామాస్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఏకంగా ఒక రోజు ఆలస్యమైంది. విమానంలో ప్రయాణిస్తున్న 30 మంది విద్యార్థులు ముఖానికి మాస్క్ ధరించడానికి నిరాకరించడమే ఈ ఆలస్యానికి కారణం. వివరాల్లోకి వెళ్తే.. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌ విమానం 893 సోమవారం అర్ధరాత్రి(అమెరికన్ కాలమానం ప్రకారం) షార్లెట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌కు రెడీ అవుతోంది. అప్పటికే టెక్నికల్ సమస్య వల్ల కొన్ని గంటల పాటు విమానం ఆలస్యమైంది. ఇంతలో బోస్టన్‌కు చెందిన 30 మంది టీనేజర్లు హల్‌చల్ చేయడంతో విమానం మరింత ఆలస్యమైంది. విమాన సిబ్బందితో టీనేజర్లు మాస్క్ విషయమై వాగ్వాదానికి దిగారు.


ఎయిర్‌లైన్స్ నిబంధనల ప్రకారం బోర్డింగ్ తర్వాత ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని విమాన సిబ్బంది చెప్పిన టీనేజర్లు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు చెప్పిన మాస్క్ వేసుకోవడానికి నిరాకరించారు. దాంతో చేసేదేమిలేక ఫ్లైట్‌ను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. దీంతో తర్వాతి రోజు ఉదయం విమానం బయల్దేరింది. ఇలా విమానం ఒక రోజు ఆలస్యమైంది. ఇదిలాఉంటే..  ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డేటా ప్రకారం 2021 జనవరి 1 నుంచి ఇప్పటివరకు ఇలా ప్రయాణికులు న్యూసెన్స్ క్రియేట్ చేసిన కోవకు చెందిన మొత్తం 3,271 ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో 2,475 ఘటనల్లో ప్రయాణికులు మాస్క్ ధరించడాన్ని నిరాకరించినవేనని సమాచారం. 

Updated Date - 2021-07-07T16:12:04+05:30 IST