గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు విశేష సేవలందించిన జి.బి.కె మూర్తికి ‘ఆపీ’ అవార్డ్..!

ABN , First Publish Date - 2022-06-25T23:20:12+05:30 IST

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఆపీ).. పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ నిపుణుడు జి.బి.కె మూర్తిని తాజాగా ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.

గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు విశేష సేవలందించిన జి.బి.కె మూర్తికి ‘ఆపీ’ అవార్డ్..!

మరో నలుగురు తెలంగాణ వైద్యులకు పురస్కారాలు

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఆపీ).. పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్ నిపుణుడు జి.బి.కె మూర్తిని ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. 2021 - 22లో గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా మూర్తికి ఈ అవార్డు దక్కింది. శాన్ ఆంటోనియోలో జరిగిన సదస్సులో భాగంగా అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. నగరంలో ఆపీ 40వ వార్షిక సదస్సు జూన్ 23 నుంచి 26 వరకు ఎంతో అట్టహాసంగా జరుగుతోంది. ఈ సదస్సులో ఆపీ.. జి.బి.కె మూర్తి చేసిన సేవల్ని ఉటంకిస్తూ ప్రశంసించింది.అమెరికా నలుమూలల నుంచి సదస్సుకు విచ్చేసిన డాక్టర్ల సమక్షంలో అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొటిముకుల ఈ అవార్డును బహుకరించారు.


ఈ సదస్సులో గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌లో విశేష సేవలందించిన డాక్టర్ దువ్వూరు ద్వారకనాథ రెడ్డి, డా. నౌనిహాల్ సింగ్, డా. మీటలకు ఆపీ నాయకత్వం ప్రత్యేక అవార్డులను బహూ కరించింది. ప్రెసిడెంట్ అనుపమ నాయకత్వాన ప్రపంచంలో ప్రజలందరికి సమానమైన వైద్య అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డిని, గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌తో పాటు ప్రజలకు వైద్యరంగానికి మధ్య గొప్ప కమ్యూనికేషన్ వారధిగా నిలుస్తున్న జిబికె మూర్తికి, తన్వీర్ ఫౌండేషన్ అధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్‌పై మహిళల్లో విస్తృతమైన అవగాహన కల్పిస్తున్న డాక్టర్ నౌనిహాల్ సింగ్‌కు, మెనోపాజ్ మీద భారత దేశంలో అత్యుత్తమ సేవలందిస్తున్న డాక్టర్ మీటకు ప్రత్యేకమైన అవార్డులను అందించి సత్కరించారు. కాగా.. సదస్సు చైర్ డాక్టర్ జయేష్ షా, సిఈఓ వెంకీ, ఎలెక్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సతీష్ కత్తుల ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.



Updated Date - 2022-06-25T23:20:12+05:30 IST