అంజలీ భరద్వాజ్‌కు అమెరికా అవార్డు

ABN , First Publish Date - 2021-02-25T11:21:11+05:30 IST

పారదర్శకత, జవాబుదారీతనం అంశాలపై అవిశ్రాంత పోరు జరుపుతున్న సామాజిక ఉద్యమకారిణి అంజలీ భరద్వాజ్‌(48)ను అమెరికా అవార్డు వరించింది. ఆమెతో సహా 12 మందిని ‘ఇంటర్నేషనల్‌ యాంటీ కరప్షన్‌ చాంపియన్స్‌ అవార్డు’కు బైడెన్‌ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డును ఇటీవలే ..

అంజలీ భరద్వాజ్‌కు అమెరికా అవార్డు

  • అవినీతిపై పోరు సల్పిన 12 మంది ఎంపిక

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 24 : పారదర్శకత, జవాబుదారీతనం అంశాలపై అవిశ్రాంత పోరు జరుపుతున్న సామాజిక ఉద్యమకారిణి అంజలీ భరద్వాజ్‌(48)ను అమెరికా అవార్డు వరించింది. ఆమెతో సహా 12 మందిని ‘ఇంటర్నేషనల్‌ యాంటీ కరప్షన్‌ చాంపియన్స్‌ అవార్డు’కు బైడెన్‌ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డును ఇటీవలే నెలకొల్పారు. భారత్‌లో సమాచార హక్కు కోసం చేసిన పోరుకు గుర్తింపుగా అంజలిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్‌ చెప్పారు.


అలాగే తమ తమ దేశాల్లో పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎంతో ధైర్యంగా పోరాడుతున్న మరో 11 మందికి కూడా అవార్డు ప్రకటించారు. ‘నేషనల్‌ క్యాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌’ కోకన్వీనర్‌గా ఉన్న అంజలి 2003లో సతర్క్‌ నాగరిక్‌ సంఘటన్‌ను స్థాపించారు. ఆర్టీఐ, లోకాయుక్త చట్టాలు అమల్లోకి రావడం వెనుక ఆమె కీలక పాత్ర ఉంది.


Updated Date - 2021-02-25T11:21:11+05:30 IST