ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌గా రికార్డులకెక్కిన Frontier

ABN , First Publish Date - 2022-06-01T02:48:24+05:30 IST

హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ (HPE) అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ ఫ్రాంటియర్ (Frontier) ప్రపంచంలోనే

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌గా రికార్డులకెక్కిన Frontier

న్యూఢిల్లీ: హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ (HPE) అభివృద్ధి చేసిన సూపర్ కంప్యూటర్ ‘ఫ్రాంటియర్’ (Frontier) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్‌గా రికార్డులకెక్కింది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ కంప్యూటర్‌గా ఖ్యాతికెక్కిన జపాన్‌కు చెందిన ‘ఫుగాకు’ (Fugaku) రికార్డును ‘ఫ్రాంటియర్’ తుడిచిపెట్టేసింది. టాప్ 500 (TOP500) జాబితాలో గత రెండేళ్లుగా ఫుగాకు అగ్రస్థానంలో ఉండడం గమనార్హం.


సూపర్ కంప్యూటర్ ఫ్రాంటియర్ 1.1 ఎక్సాఫ్లాప్‌లకు చేరుకున్నట్టు టాప్ 500 పేర్కొంది. ఇది ఎక్సాస్కేల్ స్పీడ్ బారియర్‌ను ఛేదించి ప్రపంచంలోనే మొదటి సూపర్ కంప్యూటర్‌గా చరిత్రకెక్కిందని పేర్కొంది. కాగా, అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ఓక్ రిడ్జ్ నేషనల్ లాబొరేటరీ (ORNL) కోసం హ్యూలెట్ ఈ సూపర్ కంప్యూటర్‌ను నిర్మించింది. 

Updated Date - 2022-06-01T02:48:24+05:30 IST