వామ్మో.. ఎంత పెద్ద నోరో.. చూడండి!

Aug 1 2021 @ 02:00AM

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన 31 ఏళ్ల సమంత రామ్స్‌డెల్‌ నోరు.. సాధారణంగా అందిరికీ ఉండే అంత కాకుండా కాస్త పెద్దదిగా ఉండేది. ఎంతలా అంటే.. ఒకపెద్ద సైజు యాపిల్‌ను ఆమె తన నోటితో బంధించగలరు. అలాగే పెద్ద సైజు ప్యాకెట్‌లోని ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం ఆమెనోట్లో అమాంతం పట్టేస్తాయి. తన పెద్ద నోరుతో టిక్‌టాక్ వీడియోలు చేయడంతో ఆమె బాగా పాపులర్ అయ్యారు. నెటిజన్ల సలహా మేరకు తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. డాక్టర్ సహాయంతో ఆమె తన నోటిని 6.52సెంటీమీటర్ల మేర విస్తరించగలదని గుర్తించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద నోరున్న మహిళగా సమంత గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. కాగా..వరల్డ్ రికార్డు సాధించడంపట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 


Follow Us on:

అమెరికా నగరాల్లోమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.