అమెరికాలో రోడ్డు ప్రమాదం.. 9 మంది పిల్లలుసహా 10 మంది దుర్మరణం

Jun 21 2021 @ 23:55PM

అలబామా: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రాంతంలో తుఫాను విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలా రోడ్డు ప్రమాదం జరగడంపై అధికారులు స్పందించారు. ఇక్కడ వచ్చిన వరదలు, టొర్నడోలు చాలా ఇళ్లను ధ్వంసం చేశాయని వాళ్లు వివరించారు. ఈ క్రమంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయని, ఈ నీటిలో కొట్టుకొచ్చిన వాహనాలు ఒకదాన్నొకటి బలంగా ఢీకొట్టడంతోనే రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. మొత్తం 15 వాహనాలు ఢీకొట్టుకున్నాయని, 10 మంది మరణించారని వెల్లడించారు. వీరిలో 9 మంది పిల్లలే ఉన్నరని పేర్కొన్నారు.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.