తెలంగాణలో అధికారంలోకి వస్తాం:Amit sha

ABN , First Publish Date - 2022-06-03T02:19:12+05:30 IST

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit sha) పేర్కొన్నారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తాం:Amit sha

ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit sha) పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను( telangana formation day) అమిత్ షా ముఖ్యఅతిధిగా హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ అప్పుడప్పుడు వాస్తవాలు చెప్పాలని అన్నారు. 


ఏ ఒక్క రాష్ట్రం పై మాకు ఎలాంటి వివక్ష లేదని అమిత్ షా స్పష్టం చేశారు.రాష్ట్రం అభివృద్ధి చెందితేనే... దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ భావిస్తారు.అజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది బీజేపీ కార్యక్రమం కాదు...దేశ స్వాతంత్రం కోసమే పాటు పడి, అమరులైన వారిని స్మరించుకుని వారికీ నివాళులు అర్పించడం కోసమే  ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన నిధుల వివరాలు చదువుతూ పొతే...వచ్చే ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించే సమయం వస్తుందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖి, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-03T02:19:12+05:30 IST